I am Bharat Ram Ambati, yet another blogger. About me, I doing my B.Tech (CSD) 4th year in IIIT-Hyderabad. I am no special from any other guy of my age. Frens, chatting, songs, movies (any language, any kind, old – latest, awesome – worst), games (now-a-days) and what not. I feel that i think a lot, ranging from acads, general things, politics, social service to fantasies. I found this as best place to express my thoughts, ideas, opinions, …
నాది ఒక చిన్న ఫ్యామిలి. అమ్మ,చెల్లి,నానమ్మ,నేను . నాన్న వైపు, అమ్మ వైపు దగ్గర చుట్టాలను కలుపుకుంటె ఇద్దరు పెదనాన్నలు, ఇద్దరు బాబాయిలు, ఇద్దరు బామ్మలు, నలుగురు మేనత్తలు, ఐదుగురు మవయ్యలు, ఇలా చాలా పెద్దదేనండోయ్. ఇక నా ఫ్యామిలికి వస్తె చాలమందిలాగే నేను కూడా నాది గొప్ప ఫ్యామిలి అని అనుకుంట. వాల్ల గురించి ఎంత చెప్పినా తక్కువేనని నా అభిప్రాయం. అందుకే ఒక మూడు సంఘటనలు చెబుత.
1) గచ్చిబౌలి నుంచి పంజగుట్ట టిఫిన్ తినటానికి frens కొంత మంది వెళ్ళామని చెప్పా (time 3 A.M. అని చెప్పలేదనుకోండి
)
అమ్మ: పంజగుట్ట వరకు వచ్చిన వాళ్ళు ఇంటికి (S.R.Nagar) వస్తె నేనే టిఫిన్ చేసిపెట్టే దాన్ని కద…
చెల్లి: ఇంటికి రమ్మంటె project/assignments అంటావు. పంజగుట్ట వచ్చి ఇంటికి రావా. ఐనా టిఫిన్ తినటానికి పంజగుట్ట bikes మీదా?
నానమ్మ: …(చెబితె పెద్ద class వుంటుందని చెప్పలేదు)
2) వైజాగ్ batch tripకి వెల్తునామని చెప్పా.
అమ్మ: Beach దెగ్గర జాగ్రత్తగావుండు.
చెల్లి: బాగా ఎంజాయ్ చేయి. వచ్చేటప్పుడు నాకు మంచి ear-rings తీసుకురా…
నానమ్మ: (beachకి, అందులోనూ ఇంట్లొవళ్ళతో కాకుండ వద్దని చెప్పి చెప్పి అలసిపోయి) నీకు ఎంత చెప్పినా లాభం లేదు. అందుకే ఆ trip cancel ఐపోవాలని కోరుకుంటున్నా…
3) హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ (~450 kms) bikes మీద వెళ్ళామని చెప్పా (Triples అని చెప్పలేదనుకొండి
)…
అమ్మ: మొన్న యాదగిరిగుట్టకి bikes మీద వెల్లివచ్చెటప్పటికి బాగా ఎంజాయ్ చేసాం, కానీ అంత దూరం bikes మీద వెళ్ళేసరికి వాసిపోయిందన్నావు కద. మళ్ళ సాగర్ వరకు bikes మీద ఎందుకెళ్ళారు. Bikes మీద అంతంత దూరాలు safeకాదు, ఎక్కువ వెళ్ళొదు.
చెల్లి: సాగర్ వరకు bikes మీద వెళ్ళారా! నానమ్మకి చెబుతానుండు. అబ్బాయిలేనా లేకపొతె Happy Daysలొలాగా girl frensతొనా:P
నానమ్మ: (1hr classపీకాక)నీకు ఎంత చెప్పినా వ్రుదానే. నువ్వు అమ్మాయివయుంటే బాగుండేది. ఈ tensions ఏమీ వుండేవికావు…
ps:As this is my first post, any kind of suggesitons (writing style, language, …) is most welcome…